Thursday, January 23, 2025

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండో రౌండ్ తొలగింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా రెండో రౌండ్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మెటా ఈ వారం ప్రారంభంలో వేలాది మంది ఉద్యోగులను తొలగించనుంది. తొలగించబోయే ఉద్యోగుల జాబితాను తయారు చేయాలని మెటా తన డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్‌లను కోరింది. గత సంవత్సరం మొదటి రౌండ్‌లో మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం ఉంటుంది. కంపెనీ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.

ఆదాయం తగ్గడమే లేఆఫ్‌లకు కారణమని కంపెనీ సిఇఒమార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 2022 సెప్టెంబర్ చివరి నాటికి మెటాలో 87,314 మంది ఉద్యోగులు ఉన్నారు. మెటా ప్రస్తుతం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిగి ఉంది. అయితే కంపెనీ మెటావర్స్‌పై తన వ్యయాన్ని పెంచుతోంది. మెటావర్స్ అనేది వినియోగదారులు వారి స్వంత అవతార్‌లను సృష్టించగల వర్చువల్ ప్రపంచంగా ఉంటుంది. ఖరీదైన ఆర్ అండ్ డి కారణంగా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది. ఉద్యోగుల తొలగింపుల వల్ల కంపెనీ ఆర్థిక కష్టాలు కొంతమేరకు తగ్గుతాయని భావిస్తున్నారు.

అప్‌గ్రాడ్‌లో 30% ఉద్యోగులపై వేటు

ప్రపంచవ్యాప్త మాంద్యం కారణంగా పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా ఉద్యోగుల లేఆఫ్(తొలగింపు)కు సిద్ధమవుతున్నాయి. ఈ తొలగింపు పర్వం 2022లో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పెద్ద ఎడ్‌టెక్ కంపెనీ అప్‌గ్రాడ్ తన అనుబంధ కంపెనీకి చెందిన 30 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. యునికార్న్ కంపెనీ అప్‌గ్రాడ్ 2022 సంవత్సరంలో హరప్పా ఎడ్యుకేషన్ అనే కంపెనీని రూ.300 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు మార్కెట్లో స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత కారణంగా అప్‌గ్రాడ్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News