Friday, November 1, 2024

మల్కపేట రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్

- Advertisement -
- Advertisement -
హర్షం వెలిబుచ్చిన పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటిఆర్
మరో 20రోజుల్లో రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగం మరో మైలురాయిని చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతమైంది. గోదావరినదీ జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమైన రాజన్న సిరిసిల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు ట్రయల్ రన్‌ను ఆదివారం వేకువ జామున విజయవంతంగా నిర్వహించారు. తెల్లవారు జామున 12.40గంటలనుంచి 1.40గంటల వరకూ గంటపాటు ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగింది. ఒక్కొక్కటి 30మెగావాట్ల సామర్ధంతో కూడిన రెండు యూనిట్లను సమర్ధవంతంగా రన్‌చేశారు. కాళేశ్వరం ఎత్తిపొతల పథకం తొమ్మిదవ ప్యాకేజి బాధ్యతలు నిర్వహిస్తున్న ఈఈ గంగం శ్రీనివాసరెడ్డి ట్రయల్న్ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాలు కలుగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు.

ఈఎన్‌సి ఎన్. వెంకటేశ్వర్లు మొత్తం ప్రక్రియనంతా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వచ్చారు. ఎంఆర్‌కేఆర్ కన్‌స్ట్రక్చన్స్ ,డబ్యుపిఐఎల్ ఈ పనులు పూర్తి చేసింది.టిఎస్ ట్రాన్స్‌కోకు చెందిన ఉమామహేశ్వరరావు, నవీన్,కుమార్,శ్రీనివాస్ , సంతోష్ ఉదయ్ తదితర అధికారుల బృందం ట్రయల్ రన్‌లో పాల్గొంది. ట్రయల్న్ ప్రక్రియ జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకుంటూ వచ్చారు. మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్ కావటం పట్ల రాష్ట్ర పురపాలక ఐటి శాఖల మంత్రి కె.టి.రామారావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని తొమ్మిదవ ప్యాకేజిలో కీలకమైన మల్కపేట జలాశయం పనులు పూర్తి కావటంతో జలాశయాన్ని

మరో రెండు మూడు వారాల్లోనే ర్రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగానే గత నెల 23న మొదటి పంపు ట్రయల్ రన విజయవంతం కాగా, ఆదివారం రెండో పంపు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో మల్కపేట జలాశయం రెండు పంపులు ప్రారంభానికి సిద్దమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News