Thursday, January 23, 2025

సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

రేపు ఢిల్లీ నుండి ప్రారంభించనున్న ప్రధాని మోడీ

మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రేపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మేరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ వేదికగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభం చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 6 రోజులు (గురువారం మినహా)నడిచే  ఈ వందే భారత్ రైలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన అనుసంధానాన్ని కలుగజేస్తుంది. భారతీయ రైల్వేల సేవలకు గర్వకారణమైన ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ , విశాఖపట్నం మధ్య నడిచే రెండవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ నుండి నాల్గవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 12 వ తేదీ నుండి కార్యకలాపాలను ప్రారంభించనుంది .

ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేయనున్న ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నం వరకు నడువనుంది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో నడుస్తోంది. దీంతో ఇప్పుడు అదనంగా ప్రయాణీకుల ప్రయోజనం కోసం, మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అదే మార్గంలో.. అదే స్టాపేజ్‌లతో ప్రవేశపెడుతున్నారు. ఈ రైలు సాధారణ సేవలు విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు 13 మార్చి, 2024 నుండి ప్రారంభం కానుండగా తిరుగు ప్రయాణంలోనూ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు 15 వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి. వీటికి టిక్కెట్ల బుకింగ్స్ మార్చి 12 నుండి అందుబాటులోఉంటాయి. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుండి ఉదయం 05.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ రైలు మధ్యాహ్నం 14.35 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి రాత్రి 11.20 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి , సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు ఒక ఎగ్జిక్యూటివ్ ఏ.సి చైర్ కార్ కోచ్‌లు కలిగి 530 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో సేవలను అందిస్తుంది.

Vande Bharath Express 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News