Tuesday, January 21, 2025

వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసిన భార్య..

- Advertisement -
- Advertisement -

అమరావతి: మొదటి భార్య వీడియోలు చూస్తున్నాడని ఓ మహిళ తన భర్త మర్మాంగం కోసిన దరారు ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తన మొదటి భార్యను వదిలేసి వరమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య వరమ్మతో కలిసి నందిగామలో కాపురం పెట్టాడు. అయితే, శుక్రవారం రాత్రి ఆనంద్ ముబైల్ ఫోన్ లో తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ రెండో భార్యకు దొరికిపోయాడు.

దీంతో ఆగ్రహించిన వరమ్మ, భర్తతో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుని మళ్లీ మొదటి భార్య వీడియోలు చూస్తావా అని భర్తపై దాడి చేసింది. భర్త కూడా కోపడ్డంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన వరమ్మ బ్లేడ్ తో భర్త మర్మంగాన్ని కోసి గాయపర్చింది. తీవ్రంగా గాయపడిని ఆనంద్ ను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News