Tuesday, December 24, 2024

శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడ్డ విలాసాల గుట్టు

- Advertisement -
- Advertisement -

Secret Bunker found in Sri Lanka President Bhavan

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ఇప్పటికి 48 గంటలకు పైగా ఆక్రమించుకున్న నిరసనకారులు తమకు తాము విలాసాలు అనుభవిస్తున్న దృశ్యాలతో వీడియోలను చూసుకొంటూ సంబరపడుతున్నారు. మొత్తం ఈ భవనాన్ని దోచుకుంటున్న సమయంలో ఒక రహస్య బంకర్‌ను కనుగొన్నారు. అధ్యక్షుని రాజప్రాసాదం లోని రహస్య బంకర్‌ను ఒక వార్తాసంస్థ కూడా కనుగొనగలిగింది. నిరసనకారులు ఆసక్తితో ఆ బంకర్‌ను చూడడానికి తరలివస్తున్నారు. ఈ బంకర్‌కు నకిలీ కప్‌బోర్డు అమర్చి ఉంది. భవనం లోని దాగి ఉన్న ప్రదేశాలను మరుగుపరిచే ఈ కప్‌బోర్డును నిరసనకారులు పగులగొట్టారు. బంకర్‌తో మెట్లు, ఎలివేటర్ అనుసంధానంగా ఉన్నాయి. అయినా దాని తలుపు మాత్రం మూసే ఉంది.

ఎంతో బరువుతో ఉన్న ఈ లోహం తలుపును బలవంతంగా తెరవడం లేదా బద్దలు కొట్టడం సాధ్యం కాలేదు. ప్రజలు దాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసినట్టు దానిమీద గీతలు, ఇతర గుర్తులు కనిపిస్తున్నాయి. రాజపక్స ప్రజల సొమ్మును కొల్లగొట్టి దాచుకున్నాడని ప్రజలు అనుకుంటున్నా ఆ బంకర్‌లో తాను ఏం దాచాడని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. సోమవారం ఉదయం అధ్యక్ష భవనం నుంచి నిరసనకారులు 17.85 మిలియన్ శ్రీలంక రూపాయలు (దాదాపు 50,000 డాలర్లు) కనుగొన్నారు. అవన్నీ కొత్త నోట్లే. ఆ మొత్తాన్ని పోలీసులకు అప్పగించారు. శ్రీలంక ప్రజలంతా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతుంటే అధ్యక్షుడు రాజపక్సా ఏవిధంగా విలాసాలు అనుభవించాడో తెలుసుకోడానికి నిరసనకారులు ఆ భవనాన్ని ఇంకా ధ్వంసం చేస్తూనే ఉన్నారు.

Secret Bunker found in Sri Lanka President Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News