Friday, January 24, 2025

జాగ్రత్త.. ఓయోలో సీసీ కెమెరాలు

- Advertisement -
- Advertisement -

ఇటీవల ఓయో రూమ్ లు చాలా ఫేమస్ అయ్యాయి.. ఏకాంతంగా గడిపేందుకు ఈ ఓయో రూమ్ లను ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. అయితే, కొన్ని ఓయో రూముల్లో నిర్వాహకులు సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టి.. బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు తెరలేపారు. తాజాగా శంషాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సిటా గ్రాండ్ ఓయో హోటల్ గదిలో నిర్వాహకుడు ఒంగోలు వాసి గణేష్ సీక్రెట్ సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు.

బెడ్ రూంలోని బల్బ్‌లలో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి, బాధితులను బెదిరిస్తున్నాడు. దీంతో ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఓయో రూమ్ లో తనిఖీలు చేసి పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News