Monday, December 23, 2024

గవర్నమెంట్ ఆస్పత్రిలో బట్టలు మార్చుకునే గదిలో సిక్రెట్ కెమెరా పెట్టిన అటెండర్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: మహిళలకు ఎక్కడికి వెళ్లిన రక్షణ ఉండడంలేదు. కాలు ఇంటి బయట పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే బస్సుల్లో, ఆఫీస్‌లో మహిళలనే వేధిస్తూనే ఉన్నారు. రోజు రోజుకు మహిళల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునే గదిలో అటెండర్ రహస్య కెమెరాలు పెట్టాడు. మహిళలు దుస్తులు మార్చుకున్న దృశ్యాలను తన ఫోన్‌లో నిక్షిప్తం చేశాడు. ఓ బాక్స్‌కు రంధ్రం చేసి అక్కడ కెమెరా ఫోన్‌ను పెట్టాడు. సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటెండర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతడి ఫోన్‌లో ఉన్నా వీడియోలు బయటకు తీయడంతో పాటు ఎవరెవరికి షేర్ చేశారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఎక్కడెక్కడ వైరల్ గా మారాయని మహిళ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News