Sunday, November 24, 2024

బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జిల్లా గుడ్లవల్లే రు ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థినుల హాస్టల్ బా త్రూంలో సీక్రెట్ కెమెరాను కొందరు యువతులు గురు వారం గుర్తించి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. దీని పై అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే కాలేజీలో ఇం జినీరింగ్ చదువుతున్న ఓ అమ్మాయే ఈ దారుణానికి పాల్పడినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పే ర్కొంటున్నారు. సిఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి వె ళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలు విద్యార్థిను లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశం పై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిందని దోషులు ఎంతటివారైనా వదిలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.

విద్యార్థినుల ఆందోళన
అటు, ఈ ఘటనపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ నిరసనలు కొనసాగాయి. అటు, విద్యార్థి సంఘాల నేతలు సైతం కాలేజీ వద్ద ఆందోళన నిర్వహించగా ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేసేంత వరకూ, నేరస్థులను శిక్షించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. సీక్రెట్ కెమెరా గురించి వారం ముందు నుంచే యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే ఆ న్యూస్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. న్యాయం చేయాలని అడుగుతుంటే మళ్లీ తమ మీదే రివర్స్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఉద్రిక్తతల క్రమంలో కాలేజీ యాజమాన్యం సెలవు ప్రకటించింది.

ఆందోళన విరమణ
సిఎం చంద్రబాబు ఆదేశాలతో గుడ్లవల్లేరు ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్‌ను గుర్తించే పరికరంతో హాస్టల్‌లో అణువణువు తనిఖీ చేశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సమక్షంలోనే సుమారు 4 గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఎలాంటి హిడెన్ కెమెరా లభించలేదు. తమ సమక్షంలోనే జరిగిన తనిఖీల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళన విరమించారు.

పోలీసుల కేసు నమోదు
మరోవైపు కళాశాలలో సీక్రెట్ కెమెరాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కృష్ణాజిల్లా ఎస్‌పి వెల్లడించారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు. నిందితుల ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను పోలీసులు పరిశీలించారన్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు బయటపడలేదని పేర్కొన్నారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

తప్పు చేసిన ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదు : చంద్రబాబు
మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సిఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. గుడ్లవల్లేరు కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనకు గురయ్యారన్నారు. సకాలంలో స్పందించి అధికారులను అప్రమత్తం చేశామని, హాస్టల్ మొత్తం తనిఖీ చేసినా ఇప్పటి వరకు ఎలాంటి పరికరాలు దొరకలేదని చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా సమగ్ర విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News