Wednesday, November 13, 2024

బాత్‌రూమ్‌ నుంచి బెడ్‌రూమ్ దాకా..

- Advertisement -
- Advertisement -

మియామి: రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్ష పదవినుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ తన సొంత నివాసానికి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను తరలించుకుపోయారని అభియోగాల్లో అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో అమెరికా అణు కార్యక్రమ ప్రణాళికలు, అమెరికా మిత్ర దేశాలకు పొంచి ఉన్న సైనిక ముప్పు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రచించిన ప్రణాళికలు వంటివి ఉన్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ ఉగ్రవాద సంస్థకు ఓ దేశం మద్దతు ఇస్తున్నట్లున్న ఆధారాలు సైతం ట్రంప్ తీసుకెళ్లిన పత్రాల్లో ఉన్నాయని సమాచారం.

ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో ఎస్టేట్‌లో దాదాపు 13,000 పత్రాలు లభించినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. వీటన్నిటినీ ఎస్టేట్‌లోని బాల్‌రూమ్, బాత్‌రూమ్, ఓ కార్యాలయం, బెడ్‌రూమ్‌లలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్ బాక్సుల వంటి వాటిలో వాటిని దాచిపెట్టినట్లు పేర్కొన్న అధికారులు .. వాటికి సంబంధించి ఆరు ఫొటోలను కూడా నేరాభియోగ పత్రాల్లో ఫైల్ చేశారు. ఈ ఫోటోలను శుక్రవారం మీడియాకు కూడా విడుదల చేశారు.బాత్‌రూమ్‌లో షవర్‌కు, టాయిలెట్‌కు మధ్యస్థలంలోబాక్సులను ఇరికించి పెట్టినట్లు ఒక ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొన్ని పత్రాలు నేల మీద చిందర వందరగా పడి ఉండడం కూడా ఆ ఫొటోల్లో కనిపిస్తోంది.

బాక్సులను భవనం పైకప్పుదాకా పేర్చి ఉన్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. ఈ పత్రాలను ట్రంప్ కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కూడా పంచుకున్నారని అధికారులు తమ అభియోగ పత్రాల్లో పేర్కొనడం జరిగింది. అలాగే ట్రంప్‌కు, సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణల ఆడియో క్లిపింగ్‌లు కూడా లభించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News