Wednesday, January 22, 2025

భారత్, కెనడాల విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఉద్రిక్తతల సడలింపుల దిశలో భారత్, కెనడాల విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం అమెరికాలో జరిగింది. జైశంకర్, మెలానీ జోలీ మధ్య వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీకి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చొరవ తీసుకున్నారు. గత వారం జరిగిన ఈ రహస్య భేటీలో ఇరుదేశాల మంత్రులు పలు విషయాలపై చర్చించారు. అయితే ఈ సమావేశం జరిగినట్లు ఇరుదేశాల అధికార ప్రతినిధులు ఎవరూ నిర్థారించలేదు. కెనడాలోని ఖలీస్థానీ ఉగ్రవాదుల చర్యలు,

అక్కడ ఖలీస్థానీ నేత నిజ్జర్ కాల్చివేత వంటి ఘటనలు ఇరుదేశాల నడుమ దౌత్యసంబంధాల విచ్ఛిన్నానికి దారితీశాయి. ప్రస్తుత దశలో ఏదో విధంగా భారత్‌తో వివాదం పరిష్కరించుకోవడమే మార్గమని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంతో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు అనధికారిక చర్చలకు దిగుతామని ఇటీవలే కెనడా విదేశాంగ మంత్రి తెలిపారు. అమెరికాలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది వెల్లడికాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News