- Advertisement -
కేప్‌కెనవెరెల్ : అంగారక గ్రహంపై నాసా పర్సెవరెన్స్ రోవర్ దిగడానికి ఉపయోగించే భారీ పారాచ్యూట్ పై లిఖించిన రహస్య సందేశాన్ని ఎట్టకేలకు సిస్టమ్స్ ఇంజినీర్ ఐయాన్ క్లార్క్ డీకోడ్ చేశారు. డేర్ మైటీ థింగ్స్ అనే సందేశాన్ని చదవడానికి క్లార్క్ బైనరీ కోడ్ ఉపయోగించారు. 70 అడుగుల పొడవున్న పారాచూట్ పై నారింజ, తెలుపు రంగుల్లో ఈ సందేశాన్ని పొందుపర్చారు. దీనికి కాలిఫోర్నియా పసడెనా జెట్ ప్రొపల్సన్ లేబొరేటరీ వద్ద జిపిఎస్ సాయం కూడా తీసుకున్నారు. కేవలం ఆరుగురికే ఈ సందేశం గురించి తెలుసు. అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ తాలూకు సందేశం ఇది. జెపిఎల్ గోడలపై కూడా ఈ సందేశం రాసి ఉంది.
- Advertisement -