Monday, December 23, 2024

వివేకా హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కడప ఎంపిగా అవినాష్ రెడ్డి పోటీ చేయరని వివేకా నందారెడ్డి తనతో చెప్పారని వైసిపి నేత శివచంద్రారెడ్డి తెలిపారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలతో పని చేయలేనని వివేకాతో చెప్పానని శివచంద్రా పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 1న వివేకా తన ఇంటికొచ్చారని, వైసిపి వీడొద్దని చెప్పారన్నారు. అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు టికెట్ ఇవ్వనున్నట్లు వివేకా చెప్పారని గుర్తు చేశారు. కడప ఎంపిగా విజయలక్ష్మి లేదా షర్మిల పోటీ చేస్తారని వివేకా చెప్పారన్నారు. సిబిఐ కోర్టుకు వివేకా హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు వెల్లడించారు. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ సందర్భంగా రహస్య సాక్షి ప్రస్తావన సిబిఐ అధికారులు తీసుకొచ్చారు. దర్యాప్తు ముగిశాక వివరాలు సమర్పిస్తామని గతంలో కోర్టుకు సిబిఐ అధికారులు తెలిపారు. రహస్య సాక్షిగా వైసిపి నేత వాంగ్మూలం జూన 30న కోర్టుకు సమర్పించారు. పులివెందుల వైసిపి నేత కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News