Monday, December 23, 2024

సచివాలయం ముస్తాబు

- Advertisement -
- Advertisement -

కొత్త ప్రభుత్వం కోసం సిద్ధమవుతున్న సెక్రటేరియట్
మంత్రుల నేమ్ ప్లేట్ల తొలగింపు

మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ఖాళీ చేయిస్తున్న అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు సచివాలయం, అసెంబ్లీలను కొత్త ప్రభు త్వం కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మార్పుతో ప్రస్తు తం సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి, మంత్రుల క్యాబిన్‌ల లో ఉన్న పాత నేమ్ ప్లేట్లను తొలగించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రావడంతో కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు. వారికి అవసరమ య్యే సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే పనిలో వారు ఉ న్నారు. కాగా ఇప్పటి వరకు ఉన్న ఛాంబర్లను ఖాళీ చేయడంతో పాటు వారి నేమ్ ప్లేట్లను తొలగించారు. మరోవైపు కొత్త ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు త్వరలోనే ప్ర మాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఈ నెల 9 వ తేదీన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకుని భారీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఇందు కు అనుగుణంగా నూతన ప్రభుత్వం, మంత్రులు, వారి పేషీలను సిద్ధం చేసే పనిలో నిమిగ్నమయ్యారు.
మంత్రులు, సలహాదారుల పేషీలు ఖాళీ..
కాగా సచివాయలంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారుల పేషీలను అధికారులు ముమ్మరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే సచివాలయంలోని మినిస్టర్ ఛాంబర్స్ వద్ద అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ మంత్రి ఛాంబర్‌లో ఎవరు ఉన్నారు? ఏఏ పేషీల్లో ఎవరెవరు సలహాదారులు ఉన్నారు? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీటితో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్‌ను ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన క్షణం నుండే వారు మాజీలుగా మారడం, ఆ వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరుగుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వంలో చేరే మంత్రుల కో సం మినిస్టర్స్ కార్టర్స్‌ను సిద్ధం చేయాల్సి ఉండడంతో అధికారులు ఆ పనిలోనే ఉన్నారు. ఉదా..బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో కేటాయించిన ఇళ్లను హౌస్ నెంబర్ల వారీ గా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఒకటో నెంబర్ ఇల్లు పర్యాటక , క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌దే కావడం, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆ ఇంటిని ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇలా ఏఏ క్వార్టర్లలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటూ వారిని ఖాళీ చేయించి హైదర్‌గూడలోని ఓల్డ్ ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌కు షిప్ట్ చేయిస్తున్నారు. ఇప్పటి దా కా ఓల్డ్ ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌లో ఉన్న వారీని ప్రత్యామ్నాయ ఇళ్లను చూసుకోవాలని వారికి నచ్చజెబుతున్నారు. ప్రస్తు తం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను పలువురు ఖాళీ చేయడంతో ఆ ప్రాంతం నిశ్వబ్దం అలముకుంది. కొందరు మంత్రులు ఉ. 5 గంటల నుండే తమ ఇళ్లను ఖాళీ చేయించారు. మంత్రుల క్వార్టర్స్‌లను ఇంకా త్వరగా ఖాళీ చేయించేందుకు ఆయా క్వార్టర్స్‌లో ఇప్పటి దాకా ఉన్న భద్రతను ఒక్క సారిగా తగ్గించడంతో చేసేది లేక వారు తమ ఇళ్లను ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు.
కంటతడి పెట్టుకుంటున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ఇప్పటి దాకా మంత్రులు అంతా ఒకే చోట ఉండి ఒక్క సారి గా వారి క్వార్టర్స్‌ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడంతో పలువురు మంత్రులు కంటతడి పెట్టుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అయితే ఏకంగా మీడియా ఎదుటనే కంటతడి పెట్టారు. గత పదేళ్లుగా ఇక్కడున్నామంటూ తన అనుభూతులను నెమరేసుకుంటూ ఈ భవనాలను ఖాళీ చే యడం బాధాకరంగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండి విడి పోతున్నామంటూ బోరుమన్నారు. కొత్త పాలకులకు తిరిగి ఈ క్వా ర్టర్స్ ఇవ్వాల్సి వస్తున్నందుకు , అలాగే పాత మిత్రులను విడిచి వెళ్తున్నందుకు బాధ, దుఖం ఆగడం లేదంటూ పద్మారావు కంటతడి పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News