కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని దగ్గర పిఎగా పని చేస్తున్న సచివాలయం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పని ఒత్తిడి వల్లే చనిపోయారని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాణి కుముదిని వేధింపులకు గురి చేశారని ఉద్యోగులు అంటున్నారు. ఈమేరకు కుముదిని చాంబర్ ముందు ఉద్యోగులు నిరసనకు దిగారు. చనిపోయిన రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్యోగులు కలిసేందుకు ప్రయత్నించారు.
కుముదిని పేషీలో పదకొండు సంవత్సరాల నుంచి పని చేస్తున్న రాహుల్ ఈనెల 7వ తేదిన విధి నిర్వాహణలో ఉండగా
ఆకస్మత్తుగా కింద పడిపోయారు. దీంతో ముందుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ డబ్బులు ఎక్కువ అవుతాయని అక్కడి నుండి నిమ్స్‌కు తరలించారు. రాహుల్ గుండెకు శస్త్ర చికిత్సతో పాటు డయాలసిస్ చేశారు. నలభై ఎనిమిది గంటల పాటు పరిశీలనలో ఉన్నప్పటికీ రాహుల్ తుది శ్వాస విడిచారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉద్యోగులు ఆందోళనకు దిగారు.