Wednesday, January 22, 2025

సచివాలయం వద్ద ఉద్యోగుల సంబరాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా బుధవారం తెలంగాణ సచివాలయం వద్ద ఉద్యోగులు విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటుకున్నాయి. సచివాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగుల విజయోత్సవాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందన్నారు. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారని కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటానని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇక నుంచి వాట్సాప్ కాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఉన్నంత సంతోషం ఉందని అన్నారు. ఉద్యోగులు నృత్యాలు చేస్తూ ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పాట’ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. వీర తెలంగాణమా.. వీర తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా..! ’అనే సాంగ్ ప్లే చేస్తూ.. నృత్యాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News