Wednesday, December 25, 2024

సచివాలయంలో జాబ్స్ అంటూ నిరుద్యోగులకు గాలం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగి నుంచి రూ. 2.34 లక్షలు దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ శాఖ గురువారం ట్విట్టర్ వేదికగా నిరుద్యోగులను అప్రమత్తం చేసింది.హైదరాబాద్‌లోని అంబేడ్కర్ సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు అగంతకులు అమాయక నిరుద్యోగులకు వల వేస్తున్నారని తెలిపింది.

ఫలానా శాఖలో పనిచేస్తున్నానంటూ నమ్మించి ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇలాంటివి అస్సలు నమ్మోద్దని పేర్కొంది. పైరవీలతో ప్రభుత్వ ఉద్యోగం రాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తుంచుకోవాలని వెల్లడించింది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే నియామక నోటిఫికేషన్లతోనే ఖాళీలు భర్తీ అవుతాయని మోసగాళ్ల వలలో పడొద్దని వెల్లడించింది. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News