Monday, January 20, 2025

సచివాలయంలో వాస్తుమార్పులు?

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సిఎం కాన్వాయి సెక్రటేరియట్లోకి వచ్చేది. కానీ ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఐఎఎస్, ఐపిఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సిఎంఒ ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News