Monday, January 20, 2025

మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులే: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్: ఇవాల్టి నుంచి మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 75 మంది పంచాయితీ సెక్రటరీ రిజర్వేషన్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణ పల్లె లాంటి పల్లెలు కనపడవని, ప్రతి ఊర్లో ట్రాక్టర్ ట్రాలీ, నర్సరీ, డంప్ యార్డ్, వైకుంఠధామాలతో విజయవంతంగా పల్లెలను పరిశుభ్రంగా కాపాడుకుంటున్నామని ప్రశంసించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మాత్రమే కాకుండా సీజనల్ రోగాలు కూడా తగ్గుముఖం పట్టాయన్నారు.

Also Read: వ్యవసాయం పండుగలా మారింది: వేముల

వానకాలం వచ్చిందంటే చాలు పాత రోజుల్లో రోగాలతో ఊర్లు వణికి పోతున్నాయనే వార్తలు చూసేవాళ్ళం. ఇప్పుడు మిషన్ భగీరథ, పల్లె ప్రగతి వల్ల ఆ పరిస్థితి లేదని, పల్లెలలో అంటు వ్యాధులు నిర్మూలించగలిగామని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ప్రతి తాండ గ్రామపంచాయతీ చేసుకొని కొత్త గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తగా పదివేల పోస్టులను భర్తీ చేశారని, దేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణకు 38% అవార్డులు గ్రామపంచాయతీలకు వచ్చాయంటే మన ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని, ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, వైద్యుల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ వన్ గా మారిందని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. సొంత తల్లిదండ్రుల్లాగా ఆలోచించి మీ కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాన్ని రెగ్యులర్ చేశారని, కల్మషం లేని ప్రేమ కెసిఆర్ ది కాబట్టే మీకు ఉద్యోగం ఇచ్చింది కెసిఆర్ అని, మీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసింది కూడా కెసిఆర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్న నానుడి ఉండేదని, 40 ఏళ్లు దేశంలో నడిచింది కానీ ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ వల్ల ఇది సాధ్యమైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News