Tuesday, November 19, 2024

ఎయిర్‌స్ట్రిప్‌లపై హామీ

- Advertisement -
- Advertisement -

Secretary pradeep singh met CM at pragati bhavan

 

ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలుసుకున్న పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొల్పనున్న ఆరు ఎయిర్ స్ట్రిప్‌ల అంశంపై చర్చించారు. వరంగల్ జిల్లా మామునూరులో, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌లో, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఎయిర్ స్ట్రిప్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం కెసిఆర్ పౌర విమానయాన కార్యదర్శిని ఈ భేటీలో కోరారు. కాగా రాష్ట్రంలో ఎయిర్ స్ట్రిప్ ల మంజూరీ కోసం తాను కృషి చేస్తానని ప్రదీప్ సింగ్ ఖరోలా సిఎం కెసిఆర్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఇఎన్‌సి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Secretary pradeep singh met CM at pragati bhavan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News