Monday, December 23, 2024

ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలను సందర్శించిన సెక్రటరీ

- Advertisement -
- Advertisement -

ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలను సందర్శించిన సెక్రటరీ ఉమర్ జలీల్

Secretary visiting InterSpot Valuation Centers

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదివారం సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కస్తూరిబా మహిళా కళాశాల, మహబూబియా బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసిన ఇంటర్ వాల్యుయేషన్ క్యాంపులో ఏర్పాట్లను, వాల్యుయేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎగ్జామినర్‌లకు పలు సూచనలు చేశారు. ఎవరికి కేటాయించిన విధులను వారు అందరూ సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. వాల్యుయేషన్ క్యాంపులను సందర్శించిన వారిలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అబ్దుల్ ఖాలిక్, జాయింట్ సెక్రటరీ వై.శ్రీనివాస్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News