Monday, December 23, 2024

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో నేడు ఆదివారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను పటిష్ట ఏర్పాట్లతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. గ్రూప్ -1 పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ పరీక్షను 16,829 మంది అభ్యర్థులు రాయనున్నారని, వారి కోసం జిల్లాలో 34 పరీక్షా కేంద్రాలను సిద్దంచేసి సిబ్బందిని కూడా నియమించడం జరిగిందని తెలిపారు.

ఎట్టి పరిస్థితులలో ఉదయం 10.15 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరాదని ఆదేశించారు. అబ్యర్థులు గాని ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను, సెల్‌ఫోన్‌లను తీసుకురాకూడదని, అలా వచ్చే వారిని లోనికి అనుమతించరాదని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, కలెక్టరేట్ ఏవో జగత్‌సింగ్, పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News