Monday, December 23, 2024

సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః టిఎస్‌పిఎస్‌సి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్ష కోసం కమిషనరేట్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1,

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలకు 500మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఐదుగురికంటే ఎక్కువగా గుమ్మిగూడి ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News