Monday, January 20, 2025

ఈనెల 3న జంటనగరాల్లో 144 సెక్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో జంటనగరాల్లో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 144 సెక్షన్ విధిస్తూ ఆదేశించారు. ఆదేశాలు 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. జంటనగరాల్లో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో గుమిగూడవద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News