Monday, December 23, 2024

సైబరాబాద్‌లో 144 సెక్షన్

- Advertisement -
- Advertisement -

Section 144 in Cyberabad: CP Stephen Ravindra

ఆదేశాలు జారీ చేసిన సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30, 31న వ తేదీల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెల 01వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒక ప్రాంతంలో ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ మంది గుమ్మకూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు, ఆర్మీ తదితరులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News