Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ క మిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆ దేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ధర్నా లు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఐదుగురు అంతకంటే ఎక్కువమంది ఒకేచోట గుమికూడ వద్దని,144 సెక్షన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. న గరంలో అశాంతిని సృష్టించేందుకు పలు సంస్థ లు, పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వ చ్చిందని తెలిపారు. సోమవారం నుంచి నవంబర్ 28 తేదీ ఆంక్షలు అమల్లో ఉంటాయి.ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టవచ్చని, సికింద్రాబాద్, హైదరాబాద్‌లోని మిగతా ప్రాంతాల్లో అనుమతించమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News