Thursday, January 23, 2025

సైబరాబాద్‌లో 144 సెక్షన్

- Advertisement -
- Advertisement -

Section 144 of Cyberabad Police Commissionerate

1వ తేదీ నుంచి 4వ వరకు అమలు
ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ సిపి

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధిస్తూ సిపి స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా ఐదుగురి కంటే ఎక్కువగా గుమ్మికూడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఆంక్షలు జూలై1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులు, మిలటరీ ఉద్యోగులు, హోంగార్డులు, అంత్యక్రియల్లో పాల్గొనే వారికి మినహాయింపు ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News