Friday, December 20, 2024

బీజేపీని ఓడించేందుకు లౌకిక ప్రజాస్వామ్యశక్తులు ఏకం కావాలి : సీతారాం ఏచూరి

- Advertisement -
- Advertisement -

Secular democracies must unite to defeat BJP: Sitaram Yechury

న్యూఢిల్లీ : బీజేపీని ఓడించేందుకు అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని సీపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళ లోని కన్నూర్‌లో ప్రారంభమైన సీపీఎం 23 వ పార్టీ మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత తత్వానికి వ్యతిరేకంగా అన్ని లౌకిక శక్తులతో విశాల ఫ్రంట్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ దిశలో ఎలా ముందు కెళ్లాలో పార్టీ కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు. ఇవాళ మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోరాటం, కేరళ లోని సిపిఎం ప్రభుత్వం లౌకిక వాదాన్ని రాజీ లేకుండా నిలబెట్టడం ద్వారా మార్గాన్ని చూపిందన్నారు. నేడు ప్రపంచం కేరళ ఉన్నతస్థాయి మానవాభివృద్ధి సూచికలను ప్రశంసిస్తోందన్నారు. ఐదు రోజుల పార్టీ కాంగ్రెస్ రాబోయే మూడేళ్లలో పార్టీ రాజకీయ దిశను నిర్దేశిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News