- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బేగంపేట ప్రాంతం పాటిగడ్డలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఉస్మాన్‌ను ఇజాజ్ కత్తితో పొడిచి చంపాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్‌ను ఇజాజ్ చంపాడు. అనంతరం నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -