Tuesday, November 5, 2024

ఏప్రిల్ 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఏప్రిల్ 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ పరిధిలో మొత్తం ఎనిమిది వార్డులున్నాయి. సికింద్రాబాద్ సహా మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇదివరలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు 2015లో జరిగాయి. 2020 ఫిబ్రవరి 10 తరువాత పాలకవర్గం గడువు తీరింది. తర్వాత కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. కాగా బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. న్యాయస్థానాలు కూడా కంటోన్మెంట్ బోర్డులను ఆదేశిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకుగాను విధివిధానాలపై ఇటీవల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి రావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News