Saturday, February 22, 2025

జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్‌లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి ఓయు ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. మంగళవారం ఉదయం జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పైలట్ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ విద్యార్థిని భార్గవి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేధింపులతో ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News