Tuesday, November 5, 2024

పోలీసుల ఆధీనంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

- Advertisement -
- Advertisement -

Secunderabad railway station under police control

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తమ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ట్రాక్‌లపై కూర్చొన్న ఆందోళనకారులను క్లియర్ చేసేందుకు రైల్వే డీజీ సందీప్ శాండిల్య రంగంలోకి దిగారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఆందోళన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. 13 మంది యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం కావొస్తున్నా నిరసన కారులు ట్రాక్‌ల మీదనే బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పలుమార్లు చర్చలకు పోలీసులు పిలిచారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్‌తో చర్చలకు రావాలని పోలీసులు నచ్చజెప్పారు. పది మంది కాకుంటే 20 మంది రావొచ్చని వెల్లడించారు. చర్చలకు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చని కోరారు. నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వున్నాయని పోలీసులు అంటున్నారు.

మరోవైపు ఆందోళనకారులు వెర్షన్ మరోలా వుంది. పరీక్షలు నిర్వహిస్తామని వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన 100 మందిని విడుదల చేయాలని కోరారు. అందరూ వచ్చాకే చర్చలకు వస్తామని ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిరుద్యోగులు చెబుతున్నారు. అయితే పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్ (ఏఆర్‌ఓ) తో చర్చలకు అభ్యర్థులు ఒప్పుకున్నారు అభ్యర్ధులు. మధు, బాల్‌సింగ్ అనే ఇద్దరు అభ్యర్ధులను ఈమేరకు ఏఆర్‌ఓ వద్దకు పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా పట్టాలపై కూర్చొని ఆందోళన చేస్తున్న వారిని తరిమేశారు. ఫ్లాట్ ఫాం 1,2,3లను ఆధీనంలోకి తీసుకున్నారు. అటు రైల్వే డీజీ సందీప్ శాండిల్య స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ మొత్తాన్ని క్లియర్ చేశారు. రైల్వే స్టేషన్ మొత్తం తమ ఆధీనంలో వుందని అడిషనల్ కమీషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఆందోళన చేస్తున్న వారందరినీ బయటకు పంపివేశామని ఆయన పేర్కొన్నారు. పట్టాలపై వున్న వారందరీని క్లియర్ చేశామని శ్రీనివాస్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News