Tuesday, December 24, 2024

అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా బందోబస్తు…

- Advertisement -
- Advertisement -

Secunderabad railway station violence

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి, వరంగల్, నిజామాబాద్, డోర్నకల్, కాచిగూడ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లలో పోలీసులు మోహరించారు. సికింద్రాబాద్ విధ్వంసంతో మిగతా రైల్వే స్టేషన్లలో అప్రమత్తం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు బోగీలను కర్రలతో ధ్వంసం చేయడంతో పాటు పలు రైళ్లు, దుకాణాలు, డిస్‌ప్లే బోర్డులు, స్టాళ్లను తగలబెట్టారు. బైక్‌లను కూడా తగలబెట్టారు. అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అగ్నిపథ్ రద్దు చేసి యథావిధిగా సైనికలను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ రైళ్లను రద్దుచేశారు. మొత్తం 44 ఎంఎంటిఎస్‌ సర్వీసులను రద్దుచేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. వీటితోపాటు సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News