హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్ గుప్తా వెల్లడించారు. నిన్న జరిగిన ఘటనపై డిఎం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైలు ఇంజిన్లు 5, 30 బోగీలు ధ్వంసమయ్యాయని తెలిపారు. రైళ్ల రద్దుతో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని రైల్వే డిఎం గుప్తా పేర్కొన్నారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామాగ్రి భారీగా ధ్వంసమైందని డిఎం వెల్లడించారు. పార్సిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందన్నారు. పూర్తిస్థాయి నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని గుప్తా చెప్పారు. పవర్ కార్(డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పిందని డిఎం స్పష్టం చేశారు. పవర్ కారుకు మంటలంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్ ను పునరుద్ధరణ చేశామన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12కోట్ల ఆస్తినష్టం: డిఎం గుప్తా
- Advertisement -
- Advertisement -
- Advertisement -