- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ పేరు ఉజ్జయినీ మహంకాళీగా మార్చాలని శివసేన తెలంగాణ చీఫ్ సింకారు శివాజీ డిమాండ్ చేశారు. తెలంగాణలో బ్రిటీషర్లు, నిజాం నవాబ్‌లు పెట్టిన అన్ని పేర్లను మార్చాలని సింకారు శివాజీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను భాగ్య నగర్‌గా, సికింద్రాబాద్‌ను ఉజ్జయినీ మహంకాళీగా, నిజామాబాద్‌ను ఇందూరుగా, కరీంనగర్‌ను కరినగర్‌గా, మహబూబ్నగర్‌ను పాలమూరుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రయత్నిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్పు వివాదానికి దూరంగా ఉండాలని ప్రధాని మోడీ బిజెపి మంత్రులను ఆదేశించారు.
- Advertisement -