Sunday, December 22, 2024

సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై కెసిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సఅందించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

సికింద్రాబాద్‌లోని సరోజనీదేవీ రోడ్డులో స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహాంకాళి పోలీసులు పలు సెక్షన్ల 304 పార్ట్2, ఐపిసి 420, సెక్షన్ 9బి, పేలుడు పదార్థాల చట్ట 1884 కింద కేసు నమోదు చేశారు. స్వప్న లోక్ కాంప్లెక్స్ ఎదుట సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News