Sunday, December 22, 2024

సికింద్రాబాద్‌లో వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలో సంచలనంగా మారిన వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపా ల్‌కు చెందిన 10మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాహుల్ గోయల్ అనే వ్యాపారి ఇంట్లో దుండగులు రూ. 5 కోట్ల సొత్తు చోరీ చేశారు. నేపాల్ కు చెందిన నేరగాళ్లు వ్యాపారి ఇంట్లో నమ్మకంగా పని చేస్తూ తన ముఠాతో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. వ్యాపారి అపార్ట్‌మెంట్‌లో గత ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా పని చేస్తున్న నేపాల్ కు చెందిన శంకర్ మాన్ సింగ్ సౌద్

అలియాస్ కమల్ మరో లాల్ సింగ్ తప్పా అలియాస్ బహదూర్ తప్పా, మోహన్ సౌద్, భరత్ భిస్తా, విశాల్ సౌద్, పార్వతి(కమల్ భార్య), సునీల్ చౌదరి, వికాస్ సౌద్, బ్రిజెష్, బర్షా నాథ్(బ్రిజెష్‌నాథ్ భార్య), వినోద్‌కుమార్, భారతి సౌద్(మోహన్ సౌద్ భార్య), పూజా సౌద్ (విశాల్ సౌద్ భార్య)లు మొత్తం 13 మంది నేపాలీ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడ్డట్లు వెల్లడించారు. రూ.41,60,410 నగదు, 2.8 కిలోల డైమండ్స్, బంగారం ఆభరణాలు, 9.5 కేజీల వెండి ఆభరణాలు, 18 ఖరీదైన రిస్ట్ వాచీలు తదితరాలతో కలిసి మొత్తంగా రూ.5 కోట్ల విలువైన చోరీ సొత్తును అరెస్టయిన నేపాలీ గ్యాంగ్ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్యాంగ్‌లో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చేపట్టామన్నారు.

భారీ చోరీ జరిగిందిలా…!
ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ నేపాలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు గుర్తించినట్లు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. వ్యాపారవేత్త రాహుల్ గోయల్, అతని ముగ్గురు సోదరులు సికింద్రాబాద్ లోని పీజీ రోడ్డు సింధీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. వీరంతా ఐరన్ బిజినెస్ చేస్తున్నారు. నేపాల్ కు చెందిన కమల్ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా వారి అపార్ట్‌మెంట్ లోనే వాచ్‌మెన్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ నెల 9వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండగను పురస్కరించుకుని రాహులో గోయల్ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌజ్ కు వెళ్లారు. రాహుల్ మరుసటి రోజు అంటే జులై 10వ తేదీన సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసే సరికి మెయిన్ డోర్ తాళాలు పగుల గొట్టి కనిపించాయి. వాచ్‌మెన్‌కు కేకేసినా చప్పుడు లేదు. ఎంతకీ వాచ్ మెన్ కూడా రాలేదు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన రాహుల్ గోయల్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా పని చేస్తున్న కమల్.. గోయల్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడని తెలుసుకున్నారు. చాలా కాలంగా పని చేస్తున్నందు వల్ల గోయల్ కుటుంబానికి కమల్ పై విశ్వాసం ఏర్పడింది. ఈ నమ్మకాన్నే కమల్ వాడుకు న్నాడు. బోనాల సందర్భంగా కుటుంబం అంతా కలిసి ఇల్లు వదిలి వెళ్తున్నారని గుర్తించిన కమల్.. దొంగతనాలకు పాల్పడే నాప్ల్ గ్యాంగ్ కు సమాచారం అందించాడు. మొత్తం 13 మంది నేపాల్ ముఠా రెండు కార్లలో వచ్చారు. గోయల్ ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు కాజేశారు. అయితే ఈ దృశ్యాలన్నీ ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దోపిడీ అనంతరం ముందుగా బుక్ చేసుకున్న బస్సులో నేపాలీ ముఠా నగరం విడిచి పారిపోయింది. దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిం చారు. నేపాల్ ముఠా కోసం తీవ్రంగా గాలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారంతా దేశ సరిహద్దులు దాటకముందే అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News