Wednesday, January 22, 2025

వైఎస్ షర్మిలకు సికింద్రాబాద్ టికెట్ !

- Advertisement -
- Advertisement -

షర్మిల పెట్టిన గడువు ముగియడంతో
రంగంలోకి దిగిన సునీల్ కనుగోలు
రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి షర్మిల పార్టీ విలీనంపై అధికారికంగా ప్రకటన ?

మనతెలంగాణ/హైదరాబాద్:  వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ టికెట్‌ను కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. వైఎస్సాఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని గతంలో షర్మిల కాంగ్రెస్ అధిష్టానానికి తెలియచేయడంతో పాటు కొన్ని షరతులను విధించింది. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు ఖమ్మం జిల్లాలోని పాలేరు టికెట్‌తో పాటు తనకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పించాలని అధిష్టానానికి షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు రాజ్యసభ సీటుతో పాటు ఎపి బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చింది.

ఈ షరతులకు ఒప్పుకొని షర్మిల కాంగ్రెస్ అధిష్టానానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. తనకు తెలంగాణలోనే సీటును కేటాయించాలని కోరింది. దీనికి శనివారం వరకు గడువు విధించింది. ప్రస్తుతం ఆ గడువు ఈ రోజుతో అయిపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిలకు సముచిత స్థానం కల్పించాలని, ఆమె అడిగినట్టుగానే తెలంగాణలోనే షర్మిలకు అసెంబ్లీ సీటు కేటాయించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం తనకు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఇదే విషయమై కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడడానికి షర్మిల ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ఒకవేళ తాను చేసే ప్రతిపాదనలకు కాంగ్రెస్ ఒప్పుకోకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని షర్మిల ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను తన దారిలోకి తెచ్చుకునేలా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దింపినట్టుగా తెలిసింది. ఆయన షర్మిలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు దాదాపు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. దీంతో కాంగ్రెస్‌లో వైఎస్సాఆర్టీపీ విలీన ప్రక్రియ తుది దిశకు చేరినట్టేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్లడంతో పాటు సోనియాగాంధీ, రాహుల్ సమక్షంలో వైఎస్సార్టీపీని విలీనం చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News