Monday, December 23, 2024

మణుగూరు వరకు బెళగావి ఎక్స్‌ప్రెస్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెళగావి- టు- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడిచే బెళగావి ఎక్స్‌ప్రెస్ (07335/07336)ను మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. బెళగావి టు సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. ఉదయం 5.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకునే ఈ రైలు 5.40 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50కి మణుగూరుకు చేరుకుంటుంది. మధ్యలో భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, గాంధీపురం, భద్రాచలం రోడ్ స్టేషన్‌లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మణుగూరు నుంచి సాయంత్రం 3.40కి బెళగావి ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. జూలై 1వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని ద.మ. రైల్వే శుక్రవారం తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News