Monday, December 23, 2024

సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ రైలు టికెట్ ధరలు ఖరారు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ టు తిరుపతిల మధ్య నేడు ప్రారంభంకానున్న వందేభారత్ రైలు టికెట్ ధరలను దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఎసి చైర్‌కార్ టికెట్ ధర రూ.1680లుగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరను రూ.3080లుగా నిర్ణయించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఎసి చైర్‌కార్ టికెట్ ధర రూ.1625లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరను రూ.3030లుగా అధికారులు టికెట్ ధరలను ఖరారు చేశారు. నేడు ప్రారంభమయ్యే వందేభారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్‌లో ఆగుతుంది. సికింద్రాబాద్- టు తిరుపతి మధ్య నడిచే (20701) ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి టు -సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు సేవలందిస్తుంది.

బేస్ ఫేర్ రూ.1168లు…

టికెట్ ధరలను ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో ఉంచింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్- టు తిరుపతి టికెట్ ధరలను పరిశీలిస్తే బేస్ ఫేర్ రూ.1168గా, రిజర్వేషన్ ఛార్జీ రూ.40లు, సూపర్ ఫాస్ట్ ఛార్జీ రూ.45లు మొత్తం జీఎస్టీతో కలిపి రూ.63లుగా పేర్కొన్నారు. రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు రూ.364 చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి క్యాటరింగ్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. అదే తిరుపతి- నుంచి సికింద్రాబాద్ రైల్లో బేస్ ఛార్జీని రూ.1169లుగా పేర్కొన్నారు. కేటరింగ్ ఛార్జీని మాత్రం రూ.308లుగా పేర్కొన్నారు.
సికింద్రాబాద్ నుంచి నల్గొండ రూ.470

చైర్‌కార్ ఛార్జీలు ఇలా..

సికింద్రాబాద్ నుంచి నల్లగొండకు – రూ. 470లు

సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ. 865లు

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు రూ. 1075లు

సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు రూ.1270లు

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి – రూ.1680లు

ఎగ్జిక్యూటివ్ ఛార్జీలు ఇలా…

సికింద్రాబాద్ నుంచి నల్గొండకు – రూ.900లు

సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు – రూ. 1620లు

సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకు – రూ. 2045లు

సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు రూ.2455లు

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి -రూ.3080లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News