Friday, November 15, 2024

శబరిమల వెళ్లే భక్తుల కోసం అందుబాటులోకి సికింద్రాబాద్ టు త్రివేండ్రం రైలు

- Advertisement -
- Advertisement -

Secunderabad to Trivandrum train available for Sabarimala pilgrims

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్‌లైన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దాదాపు చాలావరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలు తిరిగి ప్రారంభిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే 2021 మార్చి 20వ తేదీన ఈ రైలు మళ్లీ అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ తరువాత రైల్వే ప్రకటించిన ఈ రైళ్లలో ఇది ఒకటి. ఈ రైలు ముఖ్యంగా శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తిరిగి ప్రారంభించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి ఈ రైలు అదే రూట్‌లో మళ్లీ సేవలు అందించనుంది.

ఈ స్పెషల్ ట్రెయిన్లో ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, జనరల్ సీటింగ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. రైలు నెంబర్ 07230 మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. దక్షిణమధ్య రైల్వే ఈ ప్రత్యేక రైలును పునరుద్ధరించగానే ఐఆర్‌సిటిసిలో టికెట్ల బుకింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అన్ని రైళ్లను ఎప్పటికప్పుడు రైల్వే శాఖ శానిటైజేషన్ చేయిస్తోంది. ఆయా రైల్వే స్టేషన్‌లలో కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారులు చేపట్టారు. దీంతోపాటు ప్రతి ప్రయాణికుడికి మాస్క్ ఉండేలా చర్యలు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News