భారీగా తరలివచ్చిన భక్తులు
కరోనా తగ్గుముఖం పడితే రెట్టింపుగా ఫలహార బండి నిర్వహిస్తాం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనంను అత్తెల్లి కుటుంబ సభ్యులు ఆదివారం సమర్పించారు. ఎన్నోఏళ్ల నుంచి ఆనవాయితీగా మొదటి బోనం అత్తిలి కుటుంబం నుంచి వెళుతుండగా, జోగిని శ్యామల బోనమెత్తి అమ్మవారికి నృత్యాల మధ్య బోనాన్ని సమర్పించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని బోనంకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని బోనం ఊరేగింపులో పాల్గొన్నారు.
డప్పు వాయిద్యాలు, భక్త జన సందోహం మధ్య బోనం ఉరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించగా శ్యామల ఎత్తిన మొదటి బోనం చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపధ్యంలో జాతరకు ఎల్లప్పుడు నిర్వహించే ఫలహార ఉరేగింపు బండి తమ కుటుంబం నుంచి నిర్వహించడం లేదని కరోనా తగ్గుముఖం పడితే అంతకు మించి రెట్టింపుగా ఫలహార బండి నిర్వహిస్తామని మంత్రి తలసాని అమ్మవారిని వేడుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాతరలో పాల్గొనాలని మంత్రి కోరారు.
Secunderabad ujjaini mahankali bonalu 2021