నేటి సాయంత్రం నుంచి రైళ్ల రాకపోకలకు పచ్చ జెండా..?
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో 100 మంది చొప్పున సుమారు 600 మంది కూలీలు పనులు చేస్తున్నారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచి సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం వరద ఉధృతికి ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో రెండు చోట్ల 70 మీటర్ల చొప్పున ట్రాక్ కొట్టుకుపోయింది. మహబూబాబాద్-కేసముద్రం సెక్షన్‌లో నాలుగు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 420 మీటర్ల ట్రాక్ కొట్టుకుపోయింది. మహబూబాబాద్- కేసముద్రం మధ్య పునరుద్ధరణ పనులను పూర్తి చేసి గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో వరద ఉధృతి తగ్గకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి