- Advertisement -
హైదరాబాద్: ఈనెల తేదీన 17వ సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ అన్న అయిన దామెర రామ్ రాజుకు ఉద్యోగం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాకేష్ దామెర రామ్ రాజు విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Secunderabad Violence: TS Govt Job to Rakesh brother
- Advertisement -