Sunday, January 19, 2025

నేడు ఆదిత్యా ఎల్ 1 కీలక ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సూర్యుడిపై విశేష పరిశోధనలకు ఉద్ధేశించిన ఆదిత్యా ఎల్ 1కు సంబంధించి ఇస్రో కీలక ప్రక్రియను శనివారం చేపట్టనుంది. ఆదిత్యా ఎల్ 1 నౌక సరైన కక్షలోకి మరో దశలోనికి చేరుకునేందుకు అత్యవసరం అయిన ఈ ప్రక్రియ విజయంతానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ధేశిత ప్రయోగాల కక్షలోనికి ఈ వ్యోమనౌకను పంపించేందుకు శనివారం నాటి విన్యాసం అత్యంత కీలకం అవుతుంది.

భూమి సూర్యుడి వ్యవస్థలో హాలో ఆర్బిట్ దరిదాపుల్లో ఉండే లాగ్రేంజ్ పాయింట్ 1 (ఎల్ 1) పరిధిలోకి ఆదిత్యా నౌకను సురక్షితంగా ప్రవేశపెట్టేందుకు స్థానిక ప్రయోగకేంద్రం నుంచి తలపెట్టే ప్రక్రియ ఇస్రోకు మరో పరీక్ష కానుంది. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఆదిత్యాను నిర్థిష్టంగా నిర్థేశిత తుది మజిలీ ప్రయాణానికి చేర్చడం జరుగుతుందని ఇస్రో సాంకేతిక నిపుణులు ఆత్మవిశ్వాసంతో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News