Monday, January 20, 2025

పాకిస్తాన్ కు చైనా నిషిద్ధ రసాయనాలు

- Advertisement -
- Advertisement -

చెన్నైలో పట్టివేత

చెనై: అంతర్జాతీయంగా నిషిద్ధమైన రసాయనాలను పాకిస్తాన్ కు చైనా రవాణా చేస్తుండగా తమిళనాడు రేవులో అధికారులు గురువారం పట్టుకున్నారు. పాకిస్తాన్  జీవ, రసాయన యుద్ధానికి తోడ్పడేందుకు చైనా ఈ సరకు రవాణా చేస్తోంది.

సిఎస్ అని కూడా పిలువబడే ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్ సరుకును టియర్ గ్యాస్ , అల్లర్ల నియంత్రణకు ఉపయోగిస్తుంటారు. తమిళనాడులోని కట్టుపల్లి పోర్ట్ లో  కస్టమ్స్ అధికారులు ఆ సరుకును అడ్డుకున్నారు.

సిఎస్ అనేది అంతర్జాతీయ ఒప్పందాలు ,  భారతదేశ ఎగుమతి నియంత్రణ జాబితా క్రింద పేర్కొన్న ద్వంద్వ-వినియోగ రసాయనం(డ్యూయల్ యూజ్ కెమికల్). ఇది అల్లర్ల నియంత్రణకు ఉపయోగించడానికి వీలయినదప్పటికీ, స్వాధీనం చేసుకున్న భారీ పరిమాణం దాని సంభావ్యత సైనిక వినియోగంపై ఆందోళనలను కలిగిస్తోంది.

2560 కిలోల షిప్‌మెంట్ చైనా సంస్థ, చెంగ్డు షిచెన్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ కు చెందింది, కానీ  పాకిస్తాన్‌లోని రావల్పిండికి చెందిన రక్షణ సరఫరాదారు ‘రోహైల్ ఎంటర్‌ప్రైజెస్‌’కు సరఫరా అవుతోంది. కానీ చెన్నైలో దీనిని స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News