Sunday, December 22, 2024

ప్రధాని పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్ల : సిఎస్

- Advertisement -
- Advertisement -

Somesh meet with officials for group 4 notification

మనతెలంగాణ/ హైదరాబాద్ : నగరానికి ఈ నెల 26న రానున్న ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్షించారు. శుక్రవారం డిజిపి మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల కార్యదర్శులు,ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ 26వ తేదీన ఐఎస్‌బిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్నారని తెలిపారు. ఎన్‌ఎస్‌జితో సమన్వయంతో వివిధ శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు.

ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రజ్వి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, రాజ్‌భవన్ గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, అగ్నిమాపకశాఖ డిజి సంజయ్‌కుమార్‌జైన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News