- Advertisement -
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, కేదారినాథ్ ఆలయాల వద్ద సోమవారం ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ( ఐటిబిపి ) దళాలతో భద్రత మరింత పెంచి పటిష్టం చేశారు. శీతాకాలం కావడంతో భక్తుల దర్శనం ఆపివేసి ఆలయాలను మూసివేసినప్పటికీ, పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున నిత్తం ప్రజల రాకపోకలు జరుగుతున్నాయని ఆలయాల కమిటీ మీడియా ఇన్‌ఛార్జి హరీష్ గౌడ్ చెప్పారు. గత ఏడాది కేదారినాథ్ ఆలయానికి బంగారు రేకులను అమర్చడమైందని తెలిపారు. వీటన్నిటి దృష్టా భద్రత పెంచినట్టు ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ వెల్లడించారు.
- Advertisement -