Monday, December 23, 2024

నాలుగంచెల భద్రతలో వైఫల్యం ఎక్కడ జరిగింది?

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ లోపలకు స్మోక్ బాంబులు ఎలా వెళ్లాయి?

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అలజడి సృష్టించిన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద చొటోచేసుకున్న భద్రతా వైఫల్యాలు కొత్త పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గతంతో పోలిస్తే పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థ మరింత మరింత పటిష్టం చేసినప్పటికీ స్మోక్ బాంబులతో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించగలిగారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత పాత పార్లమెంట్ భవనం వద్ద భధ్రతను ప్రక్షాళన చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ స్థానంలో నాలుగు అంచెల భద్రతా వ్యవస్థ అమలులోకి వచ్చింది. పార్లమెంట్ వద్ద ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగంతోపాటు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కంటింజెంట్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీ ఫోర్స్, అగ్నిమాపక దళంతోసహా ఇతర సంస్థలను భద్రతా వ్యవస్థలో మమేకం చేశారు.

భద్రతా ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ వద్ద సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. భైతిక తనిఖీలతోపాటు సందర్శకుల వద్ద ఉండే వస్తువులన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ జరుగుతుంది. ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లతోపాటు చిల్లర నాణేలను సైతం లోపలకు అనుమతించరు. సందర్శకులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను చూపించాల్సి ఉంటుంది. మూడు ఫుల్ బాడీ స్కానర్లను దాడుటకునే లోపలకు ప్రవేశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే సందర్శకులకు పాసులు జారీ చేస్తారు.

సందర్శకుడి నేపథ్యాన్ని గురించి ఆరా తీసిన తర్వాత పాసుల జారీ జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుడు సంతకం చేసిన సిఫార్సు లేఖలపైనే పాసులు జారీ చేస్తారు. పార్లమెంట్‌లోని విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు వ్యక్తులు స్మోక్ బాంబులను తమ షూ లోపల దాచి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని తనిఖీ చేస్తున్న సమయంలో షూల విషయాన్ని భద్రతా సిబ్బంది విస్మరించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఫుల్ బాడీ స్కానర్లను వారిద్దరూ ఎలా తప్పించుకుని ఉంటారన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News