Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా లోపం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుండగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రాహుల్ గాంధీని కౌగిలించుకున్నాడు. కానీ తర్వాత భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని పక్కకు ఈడ్చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ యాత్ర యథాతథంగా కొనసాగింది. రాహుల్ గాంధీ భద్రతపై కొన్ని వారాల క్రితమే ఆందోళన వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. 2020 నుంచి స్వయంగా రాహుల్ గాంధీయే తన భద్రత కవర్‌ను 100 సార్లకు పైగా ఉల్లంఘించారు. రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కవరేజ్ ఉంది. అంటే అహర్నిశలు ఎనిమిది, తొమ్మిది మంది కమాండోలు ఆయనకు రక్షణగా ఉంటారు.

రాహుల్ గాంధీ పంజాబ్ సరిహద్దులోకి ప్రవేశించారు. అది చాలా సెన్సిటివ్ ఏరియా అని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఆయన కశ్మీర్ వరకు తన పాదయాత్ర చేయనున్నారు. ఆయన పాదయాత్ర చివరి అంకంలో ఉంది. పంజాబ్, కశ్మీర్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో భారత జోడో యాత్ర చేపట్టకూడదని ఆయనకు భద్రతా సంస్థలు ఇప్పటికే సూచించాయి. జమ్మూకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో బనీహల్‌లో జనవరి 25న రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఎగరేయనున్నారు. ఆ తర్వాత ఆయన అనంత్‌నాగ్ గుండా జనవరి 27న శ్రీనగర్‌లోకి ప్రవేశించనున్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News