Monday, December 23, 2024

కిషన్‌రెడ్డి వద్దకు ఆగంతకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వ ‘హించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్సవాల వేడుకలో భద్రతా లోపాలు బయటపడాయి. కేంద్ర మంత్రి జాతీయ జెండా ఆవిష్కరించి, వేదికపైకి వెళ్తుండగా ఓ అగంతకుడు స్టేజీపైకి దూసుకువచ్చాడు. నేరుగా కిషన్‌రెడ్డి వద్దకు వెళ్లినా పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కిషన్‌రెడ్డి వారించినా ఆగంతకుడు వినలేదు. అగంతకుడి వద్దనున్న పత్రాలను మంత్రి తీసుకొని వెళ్లాలని సూచించినా.. అక్కడే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో.. గన్‌మెన్లు, పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని స్టేజీ నుంచి కిందికి దింపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News